27.5 C
Hyderabad
Friday, July 31, 2026

మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగింత

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్, బతుకమ్మ : వివిధ కారణాల వలన తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకొని రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా, సిఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్ ఫోన్ లను కనిపెట్టి బుధవారం రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో సీఐ కృష్ణ, ఎస్సై సాయన్న సమక్షంలో  10 మంది బాధితులకు తమ మొబైల్ ఫోన్ లను అప్పగించారు. ఈ సందర్భంగా సీఐ కృష్ణ మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను వినియోగించి పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించవచ్చని, దీనివల్ల వ్యక్తిగత సమాచార భద్రత కూడా ఉంటుందన్నారు. మన వివరాలు నమోదు చేసి లాక్ చేయవచ్చని, మొబైల్ దొరికిన తర్వాత అన్ లాక్ చేసుకునే సౌలభ్యం కూడా ఉంటుందని అన్నారు. ఇప్పటివరకు రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 50 మంది ఫోన్లను గుర్తించి అప్పగించినట్లు పేర్కొన్నారు. బాధితుల సెల్ ఫోన్లు గుర్తించినా ఎస్సై సాయన్న, పోలీస్ సిబ్బందిని సీఐ కృష్ణ అభినందించారు.

More articles

Latest article