24.1 C
Hyderabad
Monday, August 3, 2026

 హుమ్నాపూర్ సొసైటీ ఎదుట రైతుల నిరసన

Must read

📰 Generate e-Paper Clip

వర్ని, బతుకమ్మ :  వర్ని మండలంలోని  హుమ్నాపూర్ సొసైటీ ఎదుట గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి ఎరువుల కోసం చెప్పులు అరిగిలా తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని వాపోయారు.  సుమారు రూ.  42 నుంచి 50 వేల డీడీలు చెల్లించి నెలరోజులు అవుతున్న తమకు ఇవ్వడం లేదని, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల కోసం పోతే ఈసడిస్తూ మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం రైతులు చేశారు. కొంతమంది డబ్బులు ఇస్తామంటే కూడా ఎరువులు ఇస్తారలేరన్నారు.  సొసైటీ అధికారుల నిర్లక్ష్యం తమ పాలిట శాపంగా మారిందన్నారు. వర్నిలో ప్రైవేటు ఎరువుల షాపులో కొనుగోలు చేయాలంటే అధిక రేట్లకు విక్రయిస్తున్నారని, దీంతో నష్టపోతున్నామని రైతులు  వాపోతున్నారు.

More articles

Latest article