29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధికి విరాళం అందజేత

Must read

📰 Generate e-Paper Clip

బతుక,మ్మకోటగిరి : కోటగిరి మండల కేంద్రంలోని నల్ల పోచమ్మ ఆలయ అభివృద్ధికి మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. ఆలయ నిర్మాణంలో భాగంగా ఆలయ అభివృద్ధికి సహకరించాలని కమిటీ సభ్యులు కోరడంతో లక్ష రూపాయల విరాళాన్ని ఏనుగు రవీందర్ రెడ్డి కమిటీ సభ్యులకు గతంలో అందజేశారు. ఆయన అందజేసిన నగదుతోపాటు గ్రామంలోని వివిధ వర్గాల ప్రజలు గ్రామ పెద్దలు కుల సంఘాల విధులతో ఆలయాన్ని పూర్తి చేశారు. ఆలయంలో మంగళవారం అమ్మవారికి పూజలు నిర్వహించి గ్రామ పండగను నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని అన్ని కులాల ప్రజలు పండగను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కర్ణ గజేందర్, పత్తి సురేష్, పాకల సాయిలు, మాజీ ఎంపీపీ గంగాధర్ దేశాయ్, గ్రామ పెద్దలు తెల్ల రవికుమార్, బీమా సాయి రెడ్డి, ఎల్లుట్ల గజేందర్, గర్దాస్ ఆనంద్, బర్ల భూమయ్య, కూచి సాయిబాబా, కాంగ్రెస్ నాయకులు మాజీ జెడ్పిటిసి లు ద్రోణవల్లి సతీష్, కొత్త కొండ భాస్కర్, డిసిసిబి డైరెక్టర్ కమలహాసన్ రెడ్డి, వహీద్ సలీం, యాదుల్, సోహెల్, వాజిద్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article