26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దీపాదాస్ మున్షిని అహ్వనించిన పోచారం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బాన్సువాడ 

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్ మున్షీ ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. శనివారం హైద్రాబాద్ లో వ్యవసాయ సలహాదారు నియామకానికి సహకరించిన దీపాదాస్ మున్షీ ని శాలువా, పుష్పగుచ్ఛం అందించి ధన్యవాదాలు తెలిపారు. త్వరలో జరిగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాధ్యతల స్వీకార కార్యక్రమానికి ప్రత్యేక అతిధులుగా హాజరుకావాలని మున్షీ ని ఆహ్వానించారు. తన ఆహ్వానాన్ని అంగీకరించి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి హాజరు అవుతానని  హమీ ఇచ్చారు అని పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. పోచారం వేంట నిజామాబాద్ మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, హైదరాబాద్ డిసిసి అధ్యక్షులు రోహిన్ రెడ్డి , గాల్ రెడ్డి , రాజీవ్ రెడ్డి లు పోచారం తో ఉన్నారు.

More articles

Latest article