24.1 C
Hyderabad
Monday, August 3, 2026

బాన్సువాడలో వృద్దుడి దారుణ హత్య

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ , బతుకమ్మ : పట్టణంలో దుండగులు ఓ వృద్దుడిని సోమవారం రాత్రి దారుణంగా హత్య చేశారు. సరస్వతి ఆలయ సమీపంలో వాచ్ మెన్గా పని చేస్తున్న సాలె వెంకటి గత నాలుగైదులుగా ప్రకాశ్ అనే స్థిరాస్తి వ్యాపారి వద్ద వాచ్ మెన్ గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి అతడు హత్యకు గురయ్యాడు. ఘటనాస్థలంలో పేక ముక్కలు, రెండు సెల్ ఫోన్ లు పడి  ఉన్నాయి. పేకాడిన వారే వెంకటిని హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు.

 

 

More articles

Latest article