27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఆడబిడ్డల పండుగ బతుకమ్మ

Must read

📰 Generate e-Paper Clip

  • సింగరేణి గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలి
  • సింగరేణిని నష్టాల బాట పట్టించి దివాళా తీయించే కుట్ర
  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
  • సింగరేణి కార్మికులు, మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చి ఆడి పాడిన కవిత

 

శ్రీరాంపూర్, బతుకమ్మ : తెలంగాణ ఆడబిడ్డల పండుగ బతుకమ్మ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సింగరేణి గ్రాస్ లాభాలపై బోనస్ ప్రకటించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ లో సింగరేణి కార్మికులు, మహిళలతో కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బతుకమ్మ పేర్చి ఆడి పాడారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వ చర్యల కారణంగా ఒక్కో కార్మికుడికి లక్ష నష్టం.  సింగరేణిని నష్టాల బాట పట్టించి దివాళా తీయించే కుట్ర.  సంస్థకు ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 42 వేల కోట్లు వెంటనే చెల్లించాలి. సింగరేణి విషయంలో ప్రభుత్వ వైఖరి పై ఆగ్రహం. సింగరేణి అంటే నాకెంత ప్రాణమో మీకు తెలుసు. తెలంగాణ రాకముందు నుంచి సింగరేణి కార్మికుల కోసం పోరాడుతున్నా. మనకు కరువులో అన్నం పెట్టింది సింగరేణి. ఆంధ్ర పాలనలో మనకు ఉద్యోగాలంటే సింగరేణి ద్వారా వచ్చినవే. తెలంగాణ వచ్చాక డిపెండెంట్ ఉద్యోగాలను మళ్లీ సాధించుకున్నాం.

Bathukamma, the festival of girls

సింగరేణి సంస్థకు ఈ ప్రభుత్వం రూ. 42 వేల కోట్ల బకాయిలు పెట్టింది. సింగరేణిలో గనులను తెరవాల్సి ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోవటం లేదు. కానీ కర్ణాటక లో ఒక గని, మరోచోట రాగి గనిని తీసుకున్నారు. వాటిని తవ్వేందుకు డబ్బులు లేవంటూ ఎల్ఐసీని రూ. 3 వేల కోట్లు అప్పు అడుగుతున్నారు. అంటే పద్దతి ప్రకారం సంస్థను దివాళా తీయించే కుట్ర చేస్తున్నారు. సింగరేణి కి ఇవ్వాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి తగ్గించుకోవాలి. అప్పుడు అన్ని పనులు చేసే అవకాశం ఉంటుంది. కార్మికులకు లాభాల్లో వాటా అంటూ సీఎం బిచ్చం వేశారా? లాభాల్లో అభివృద్ది పనుల వాటా తీసేసి మిగిలిన దానిలో వాటా ఇవ్వటమేమిటీ? మొత్తం గ్రాస్ లాభాల మీద కార్మికులకు బోనస్ ఇవ్వాలి. ముఖ్యమంత్రి చర్య కారణంగా ఒక్కో కార్మికుడికి లక్ష రూపాయల నష్టం జరుగుతోంది. సింగరేణిలో చాలా గనులను తెరవాల్సి ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏటా 5 గనులు తెరవాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణికి ఉన్న గనులను తెరవాల్సి ఉంది. సింగరేణి విషయంలో రాజకీయం జోక్యం ఉండొద్దని కార్మికులు కోరుతున్నారు. సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ నాయకులే గెలిచారు. కార్మికులకు మంచి చేయకపోగా…రౌడీయిజం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇలాగే చేస్తే కాంగ్రెస్ మళ్లీ గెలవదు. సరైన సమయంలో కాంగ్రెస్ కు కచ్చితంగా బుద్ది చెబుతారు. జాగృతి భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది సింగరేణి కార్మికులు నిర్ణయించాలి. నా ఒక్కరి కోసం ఏ నిర్ణయం తీసుకోను. అందరితో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా’’ అని అన్నారు.

Bathukamma, the festival of girls

More articles

Latest article