27.3 C
Hyderabad
Friday, July 31, 2026

సామాజిక అసమానతలు అన్యాయాలపై కలం ద్వారా పోరాడిన ప్రజాకవి అన్నాబాహు సాఠే

Must read

📰 Generate e-Paper Clip

 

. . . టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్

 నిజామాబాద్, బతుకమ్మ:

దేశంలో దళిత సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన మహానుభావుడు అన్నాబాహు సాఠే అని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ చౌరస్తాలో లోక్ షహిర్ అన్నబాహు సాఠే విగ్రహన్ని సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూర్ లక్ష్మన్ తో కలిసి బోమ్మ మహేష్ కుమార్ గౌడ్ అవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ…

Annabahu Sathe, a popular poet who fought against social inequalities and injustices through his pen

పేదలు, అణగారిన వర్గాల జీవన వాస్తవాలను తన రచనల ద్వారా ప్రతిబింబించిన గొప్ప రచయిత అని కోనియాడారు. సామాజిక అసమానతలు, అన్యాయాలపై కలం ద్వారా పోరాడిన ప్రజాకవి సమానత్వం, న్యాయం, మానవ హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారు అని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ ,కుల సర్వే తో దేశానికి రోల్ మోడల్ గా తెలంగాణ అని అన్నారు. అన్నాబాహుసాఠే  ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకం యువత ఆయన జీవితం నుండి ప్రేరణ పొందాలిఅ ని పిలుపు నిచ్చారు. సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం రాహుల్ గాంధీ నినాదం ఎవరు ఎంతో వారికి అంత అనుగుణంగా ముందుకు వెళ్తున్నాం ఎన్నికల వరకే రాజకీయాలు. ఆ తరువాత అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్నాం అన్నారు…

Annabahu Sathe, a popular poet who fought against social inequalities and injustices through his pen

 అన్ని వర్గాలకు తెలంగాణ ప్రజలు అండగా ఉంటుంది…. మంత్రి అడ్లూర్ లక్ష్మణ్ కుమార్

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు సమ న్యాయం చేయాలని అందరిని కలుపుకొని ముందుకు వెళుతున్నామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. నిజామాబాద్ నడిబొడ్డున అన్నాబాహు సాఠే విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, ఆ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామన్నారు. తెలంగాణ ఎస్సీ వర్గికరణ పలాలు అట్టడుగున ఉన్న దళితులకు సమానంగా దక్కాలని వర్గికరణకు ప్రభుత్వం మొదటి నుంచి మద్ధత్తు తెలిపిందన్నారు.

Annabahu Sathe, a popular poet who fought against social inequalities and injustices through his pen

 అట్టహసంగా అన్నబాహు సాఠే విగ్రహ విష్కరణ……

నిజామాబాద్‌లో ప్రముఖ సామాజిక సంస్కర్త డాక్టర్ అన్నాబాహు సాఠే విగ్రహావిష్కరణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ,మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ ధర్పల్లి రాజేశ్వర్ రావు, బరికుంట శ్రీనివాస్ ల అధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో  నూతనంగా ఎన్నికైన నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల మాదిగ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లను ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో విశిష్ట అతిథులుగా.. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎస్సీ సెల్ చైర్మన్, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ , నాందేడ్ ఎంపి రవింధ్ర వసంత రావు చౌహన్, నిజామాబాద్ మేయర్ ఉమారాణి, డీసీసీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, రామకృష్ణ, నూడా చైర్మన్ కేశ వేణు, ఎస్సీ ఎస్టీ పీపీ దయాకర్, బాల్కొండ ఇంచార్జ్ సునీల్ రెడ్డి, ఆకుల లలిత తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి  భారీ సంఖ్యలో  కార్యకర్తలు, ప్రజలు హాజరయ్యారు

Annabahu Sathe, a popular poet who fought against social inequalities and injustices through his pen
Annabahu Sathe, a popular poet who fought against social inequalities and injustices through his pen

More articles

Latest article