27.5 C
Hyderabad
Friday, July 31, 2026

వేయి గొంతుకలు.. లక్ష డప్పులు.. రథయాత్ర ప్రారంభం

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ: మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా వేయి గొంతుకలు.. లక్ష డప్పుల రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్రను కల నేతలు మచ్చ దేవేందర్, అందే భాస్కర్, జిల్లా ఇంచార్జి ఇంజం వెంకట స్వామి మాదిగ ప్రారంభించారు. ఈ రథయాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 58 మండలాలు తిరిగి మాదిగలను, సమాజాన్ని చైతన్యం చేస్తుందని ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ నాయకులు తెలిపారు. ఫిబ్రవరి 7న జరిగే వెయ్యి గొంతుకలు.. లక్ష డప్పులు సాంస్కృతిక మహా ప్రదర్శనను విజయవంతం చెయ్యాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ రథయాత్రలో జిల్లా వ్యాప్తంగా డప్పు కళాకారులు వందలాదిగా వచ్చి పాల్గొని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ కళా మండలి జిల్లా అధ్యక్షులు నల్ల మహేందర్ మాదిగ, డప్పు కళాకారులు మండలి అధ్యక్షుడు డప్పు సంతోష్ మాదిగ, రాంపూర్ సాయి మాదిగ, భూమేష్ మాదిగ, నవీన్ మాదిగ, చిట్టి బాబు, డోలక్ దుశాంత్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ, ఎంఎస్పీజిల్లా అధ్యక్షులు సరికేలా పోశెట్టి మాదిగ, మైలారం బాలు మాదిగ, మంద ప్రభాకర్ మాదిగ, ఎంఈఎఫ్ జాతీయ నాయకులు తెడ్డు గంగారాం మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు, ఎంఎంఎస్ నాయకులు, ఎంఎస్ఎఫ్ నాయకులు, మాదిగ కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు.

A thousand voices.. a lakh drums.. the beginning of the Rath Yatra

More articles

Latest article