ప్రభుత్వ వైద్య కళాశాలలో ఘనంగా అంబేద్కర్ జయంతి

0 9,901

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

నిజామాబాద్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలకు, భారత రాజ్యాంగ నిర్మాతగా ఆయన పోషించిన పాత్రకు గాను బి.ఆర్.అంబేద్కర్ ను స్మరించుకున్నారు. ప్రిన్సిపాల్ & అదనపు డి.ఎం.ఇ డాక్టర్ ఎన్. కృష్ణ మోహన్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి. వి. నాగమోహన్ రావు, అసిస్టెంట్ డైరెక్టర్ రమాదేవి, అడ్మిన్ సూపరింటెండెంట్ పెద్దొల్ల నాగరాజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళాశాల పరిపాలనా సిబ్బంది, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పారిశుధ్య సిబ్బంది ఈ వేడుకలలో చురుకుగా పాల్గొని ఘన నివాళులు అర్పించారు.

Leave A Reply

Your email address will not be published.