29.1 C
Hyderabad

పోలీస్, ఆర్మీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఘన సన్మానం

Must read

📰 Generate e-Paper Clip

భీంగల్, బతుకమ్మ :

 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని మెండోరా గ్రామంలో ఆర్మీ, పోలీస్ శాఖల్లో ఇటీవలే ఉద్యోగాలు సాధించిన జవాన్లు, వారి తల్లిదండ్రులను సోమవారం ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా ఆర్మీలో చేరిన గుడిసె రాజు, గౌరు రాకేష్ లను పోలీస్ జవాన్ లు గా ఉద్యోగం సాధించిన పందిరి అరుణ్, బాణావత్ రాజుల తల్లితండ్రులను పూలమాల, శాలువాలతో సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్, వీడీసీ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమం లో పాఠశాల ఉపాధ్యాయులు, యువజన సంఘాల సభ్యులు, పాఠశాల కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article