29 C
Hyderabad
Monday, August 3, 2026

గంగమ్మ ఒడిలోనే తుది శ్వాస వదిలిన మత్స్య కార్మికుడు

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాచారెడ్డి: చేపల వేటకు వెళ్లి వరదలో చిక్కుకొని గల్లంతైన మత్స్య కార్మికుడు గంగమ్మ ఒడిలోనే ఒరిగాడు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామానికి చెందిన మత్స్య కార్మికుడు శివరాములు (55) ఎగువ మానేరు వాగు ప్రవాహం లో చిక్కుకొని గల్లంతయ్యాడు. రెండు రోజులుగా అతని ఆచూకీ కోసం గాలించారు. జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షించారు. వరద ఉధృతి తగ్గిన తర్వాతనే గంగమ్మ ఒడ్డుకు చేర్చింది. వర్షం పడుతుంది. వరద ఉధృతి ఎక్కువగా ఉందని అటువైపు వెళ్లకుమని తోటి వారు చెప్పనా వినకుండా పోయి మాకు దూరమయ్యావా… అంటూ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మత్స్య కార్మికులు కోరారు.

More articles

Latest article