30.2 C
Hyderabad

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు..

Must read

📰 Generate e-Paper Clip

  • ఒకరి మృతి, ఒకరికి గాయాలు

 

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం వద్ద జాతీయ రహదారిపై తరచూ రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో కారు ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని దేవీ తండా పెట్రోల్ బంక్ ఎదురుగా 44వ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్​ వైపు వెళ్తున్న కారు పెట్రోల్ బంకు వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న వారిలో నర్సింహా రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి విశాల్​కు గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో నిజామాబాద్​కు తరలించారు. కాగా.. వీరు హైదరాబాద్​ నుంచి ఇచ్చోడ వెళ్తున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియల్సి ఉంది.

A car hit a parked lorry..

More articles

Latest article