- బాధితులకు అప్పగింత
నిజామబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ టౌన్ వన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ ప్రాంతాలలో మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న బాధితులకు ఫోన్ లను రికవరి చేసి అప్పగించినట్టు ఎస్ హెచ్ఓ రఘుపతి తెలిపారు. పోలీస్ స్టేషన్ లో శనివారం సుమారు రెండు లక్షల విలువైన ఫోన్ లను బాధితులకు అప్పగించారు. సిఇఐఆర్ పోర్టల్ ద్వార పోగొట్టుకున్న, దొంగలించబడిన ఫోన్ లను వాటి యజమానులకు అప్పగించడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా టౌన్ వన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్ బస్టాండ్ మార్కెట్ తదితర రద్దీ ప్రాంతాలలోని మొబైల్ దొంగతనాల నుండి జాగ్రత్త వహించాలని ఎస్ హెచ్ఓ రఘుపతి సూచించారు.
