24.7 C
Hyderabad
Monday, August 3, 2026

ప్రధాని మోడీ పాలనలో ఆహార, ఆర్థిక సంక్షోభం

Must read

📰 Generate e-Paper Clip

  • సిపిఎం పార్టీ మహాసభల్లో రాష్ట్ర నాయకులు జ్యోతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో ప్రజలు ఆర్థిక, ఆహార సంక్షోభంతో అనేక ఇబ్బందులకు గురవుతున్నారని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జ్యోతి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకపడ్డారు. జిల్లా కేంద్రంలో శనివారం రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో సిపిఎం పార్టీ జిల్లా మహాసభలుప్రారంభమయ్యాయి.ఈ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర నేతలు హాజరయ్యారు ఈ సందర్భంగా కార్యవర్గ సభ్యురాలు జ్యోతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రజల్లో కేంద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంవల్లే కేంద్రంలో బీజేపీకి మూడోసారి సీట్లు తగ్గాయని ఆమె అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో జిల్లా మహాసభలు ప్రారంభించారు. ఇటు రాష్ట్రంలో కూడా పాలన దారుణంగా తయారైందన్నారు. అనంతరం రాష్ట్ర కార్యవర్గ కమిటీ సభ్యురాలు రమ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఒక్కటీ పూర్తిగా నెరవేరలేదన్నారు. అంతకుముందు నగరంలోని ధర్నా చౌక్ నుండి ఖలీల్ వాడి లోని రాజీవ్‌ గాంధీ ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు పాలడుగు భాస్కర్, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్‌ బాబు, నాయకులు పెద్ది వెంకట్‌ రాములు, నూర్జహాన్‌, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Food and financial crisis under Prime Minister Modi's rule

More articles

Latest article