23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

అప్పుల బాధ తో రైతు ఆత్మహత్య

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ భిక్కనూరు: అప్పుల బాధ భరించలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన భిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో శనివారం  చోటుచేసుకుంది. ఎస్సై తెలిపిన సమాచార ప్రకారం పెద్ద మల్లారెడ్డి గ్రామం కు చెందిన తాళ్లపల్లి మల్లయ్య (53) అనే రైతు గత రెండు సంవత్సరాల క్రితం కూతురు మరియు కుమారుని ఇద్దరు వివాహం చేయడం వల్ల ఆర్థికంగా అప్పులు కావడంతో ఈ అప్పులు తీర్చలేక 10 రోజుల క్రితం పొలం వద్ద పురుగుల మందు తాగి వచ్చినాడు. 108 లో అంబులెన్స్ తో చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా డాక్టర్ గారు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ దవఖాన కు పంపగా ఉదయం 3 గంటల సమయంలో చనిపోవడం జరిగింది. మృతిని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నమని ఎస్సై సాయికుమార్ తెలిపారు.

More articles

Latest article