24.2 C
Hyderabad

భర్త కు గొంతుకి ఉరివేసి హత్య చేసిన భార్య

Wife murders husband by strangling him with a noose

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ప్రియుడితో కలిసి ఘాతుకం

 నిజామాబాద్ క్రైం,బతుకమ్మ:

భర్తను భార్య ప్రియుడితో కలిసి మట్టుబెట్టింది. ఈ సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగు చూసింది. నగరంలోని అశోక్ నగర్ కు చెందిన సజ్జాద్ ఖాన్, పర్హనా బేగం భార్య భర్తలు. వారిద్దరికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. పర్హనా బేగం కు మన్సూర్ అనే వ్యక్తి తో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయంలో భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి అదే విషయంలో భార్య తో సజ్జద్ ఖాన్ ( 40) గొడవపడ్డాడు. ప్రియుడు మన్సూర్ ను రప్పించిన పర్హనా భర్త గొంతుకి ఉరి బిగించి హత్య చేసింది. ఆదివారం ఉదయం సజ్జద్ మరణంపై సందేహలతో పోలీసులకు ఫిర్యాదు రావడంతో ఈ విషయం బహిర్గతం అయింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.

Wife murders husband by strangling him with a noose

More articles

Latest article