30.4 C
Hyderabad

కామారెడ్డి బల్ధియా సమావేశం రసాభాస

Kamareddy Baldia meeting is a controversial one

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సమస్యలు పరిష్కరించాలని పోడియం ముందు బీజేపీ కౌన్సిలర్ల నిరసన

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి మున్సిపాలిటీ పాలకవర్గం సమావేశం రసాభాసగా సాగింది. ఇటీవల బల్ధియాలో అధికార పార్టీపై మిత్రపక్షమైన బీఆర్ఎస్ తిరుగుబాటు చేయగా శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో బీజేపీ అధికార పార్టీని నిలదీసింది. కామారెడ్డి పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని బీజేపీ కౌన్సిలర్లు పొడియం ముందు బైటాయించి నిరసన తెలిపారు. కామారెడ్డి బల్ధియా సమావేశం అదనపు కలెక్టర్ ఎన్.వై.గిరి హాజరు కాగా చైర్ పర్సన్ ఉమారాణి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు మాట్లాడుతూ వార్డుల్లో పారిశుధ్య సమస్య, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని కౌన్సిలర్లే అధికారులకు, కమిషనర్ కు పాలకవర్గంలో చెప్పినా పట్టించుకోకపోతే సమావేశాలు ఎందుకని మండిపడ్డారు. కాలనీల్లో సమస్యలు ఉంటే తిరుగలేకపోతున్నామని సంబంధిత సమస్యల ఫోటోలను ధరించి సమావేశంలో పొడియం ముందు బైటాయించి నిరసన తెలిపారు. బీజేపీ కౌన్సిలర్లు నెలపై కూర్చోని నిరసన తెలుపడంతో సమావేశం కాస్తా రసాభాసగా మారింది. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని బీష్మించుక కూర్చున్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చైర్ పర్సన్ కౌన్సిలర్లకు పరిష్కారం కోసం హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు.

More articles

Latest article