26.3 C
Hyderabad

సూపర్ బ్రెయిన్ యోగా వలన జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది

Super Brain Yoga improves memory.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . అందె జీవన్ రావు

 

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ :

 

సూపర్ బ్రెయిన్ యోగా వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని పరిశోధనల ద్వారా తేలిందని, ఆ పరిశోధనా వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందె జీవన్ రావు వివరించారు. శుక్రవారం నిజామాబాద్ మండలం లోని కాలూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అఫ్ నిజామాబాద్-నేత ఆధ్వర్యంలో ” సూపర్ బ్రెయిన్ యోగా” అంశంపై రాష్ట్ర అవార్డు గ్రహీత గుంజీళ్ళ అంతర్జాతీయ ప్రచారకులుగా పేరొందిన అందె జీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ బ్రెయిన్ యోగా ప్రతినిత్యం చేయడం వలన విద్యార్థులలో జ్ఞాపక శక్తి, అభ్యసనం, సృజనాత్మకత, జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, సమస్యా పరిష్కారం, వ్యాధి నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది, సమస్యలు, ఆందోళనల నుండి ఉపశమనం కలుగుతుందన్నారు. ఉదయం సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన రోజంతా పదునైన మనసుతో రోజువారీ కార్యక్రమములలో చురుకుగా పాల్గొనవచ్చన్నారు. అనంతరం విద్యార్థులు, సిబ్బందిచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు  కిష్టయ్య  మాట్లాడుతూ  విద్యార్థులు సూపర్ బ్రెయిన్ యోగాను ప్రతి రోజు ఆచరిస్తూ మేధో సంపత్తిని, ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. విద్యార్థుల సందేహాలకు అందె జీవన్ రావు సమాధానాలతో నివృత్తి చేశారు. అందె జీవన్ రావును సిబ్బంది శాలువాతో  ఘనంగా సన్మానించినారు. కార్యక్రమంలో భాగంగా విశ్రాంత డివిజనల్ పంచాయత్ అధికారి సురేందర్, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్రను వివరించి, విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించినారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస్, శోభా రాణి, విజయ, శేషు, శ్రీమన్నారాయణాచార్య, సత్యం, క్లబ్ పీఎస్ టీలు, తదితరులు పాల్గొన్నారు.

 

 

More articles

Latest article