27.6 C
Hyderabad

డిఈవో కార్యాలయంలో సెక్షన్ల మార్పిడి వివాదం

Controversy over the reshuffling of sections at the DEO office

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిబంధనలకు విరుద్దంగా సెక్షన్ల కేటాయింపు

 

. . . వర్క్ అడ్జెస్ట్ మెంట్ పేరిట ఇష్టారాజ్యాంగా సెక్షన్ల మార్పు

 

నిజామాబాద్, బతుకమ్మ :

 

నిజామాబాద్ విద్యాశాఖలో మొన్నటి వరకు ఇంచార్జి డిఈవోగా వ్యవహరించిన అశోక్ కుమార్ విధుల నుంచి తప్పుకోగానే జరిగిన సెక్షన్ల మార్పిడి వివాదాస్పదమౌతుంది. జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్ పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన తర్వాత జరిగిన సెక్షన్ల మార్పిడి రూల్స్ విరుద్దంగా జరిగిందనే చర్చ జరుగుతుంది. ఇంచార్జి డిఈవోను పక్కదారి పట్టించి సెక్షన్లను మార్పిడి చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా డిఈవో కార్యాలయంలో అందులోని సమగ్ర శిక్ష అభియాన్ లో జరిగిన సెక్షన్ ల మార్పిడి ఇప్పుడు హాట్ హాట్ గా మారింది. సెక్షన్లను సైతం కాసులు కురిపించేవి కొందరికీ, ఒక సామాజిక వర్గానికి చెందిన వారికే కీలక పోస్టులు ఇవ్వడం పై పలు వాదనలు వినిపిస్తున్నాయి. డిఈవో కార్యాలయంలో కొందరు అధికారులు ఇంచార్జి డిఈవోను పక్కదారి పట్టిస్తూ ఎస్టాబ్లిష్మెంట్ సీనియర్ క్లర్క్, సర్వ శిక్ష అభియాన్ లో సీనియర్ అసిస్టెంట్ గా పదోన్నతి పొందిన వారికి డీఈఓ ఆఫీస్ లో సెక్షన్ ఇప్పించడానికి చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ప్రైవేట్ స్కూల్స్ సంబంధించిన మండలాలను పంచుకోవడం,  గైడ్ లైన్స్ కు విరుద్ధం. డిఈఓకి డైరెక్ట్ లాగిన్ ఉన్నప్పటికీ సెక్షన్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్స్ మండలాల్లో పంచుకోవడం వెనుక మతలబు ఏమిటని చర్చ మొదలైంది. బోధన్ డిప్యూటీ డివో ఆఫీస్ కు బదిలీ అయిన క్లర్క్ ను డిఇఓ ఆఫీసులో బి3 సెక్షన్ ఇప్పించడం వెనుక మతలబు జరిగిందని విమర్శలున్నాయి. సెక్షన్ ఇవ్వడంతో  వెంటనే ఎఫ్ ఆర్ ఎస్ కూడా యాడ్ చేయడం విశేషం. సమగ్ర శిక్ష నుండి శ్రీనివాస్ జగిత్యాలకి బదిలీ కావడంతో ఖాళీ అయిన పోస్ట్ లో పదోన్నతిపై విచ్చేసిన వ్యక్తికి అక్కడే సెక్షన్ ఇవ్వకుండా డి ఈ ఓ ఆఫీసులో ఎస్సెస్సీ ఎగ్జామినేషన్ సెక్షన్ ఇవ్వడం ఏమిటని టాక్ నడుస్తోంది. అవినీతి, ఇష్టారాజ్యంగా లాబీయింగ్ చేసి నచ్చిన వారికి నేర్పించిన వారికి బంధువులకు సెక్షన్ ను మార్చరనే ఆరోపణలు వస్తున్నయి. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ సెక్షన్ లో నుండి మరో సెక్షన్ లో ఉన్న  ఎండిఎం ను ఇటీవలే వచ్చిన వ్యక్తికి కేటాయించడం, పదోన్నతిపై సమగ్ర శిక్షలో పని చేస్తున్న వ్యక్తికి కేజీవీవీలో సమగ్ర శిక్ష లో ఇవ్వాల్సింది పోయి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న వారికి కేజీబీవీలో ఇచ్చారు. దానితో కినుకు వహించిన సదరు ఉద్యోగి సెక్షన్ మార్పిడి ఇష్టం లేకుండా జరిగిందని లీవ్ పెట్టేసి వెళ్లినట్లు అందిన సమాచారం.

More articles

Latest article