31.9 C
Hyderabad

ఘనంగా అచ్చంపేట  మల్లూరు పీఏసీఎస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం

Swearing-in ceremony of Achampet and Mallur PACS chairmen held on a grand scale

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ముఖ్య అతిథులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

 

నిజాంసాగర్, బతుకమ్మ :

 

నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, మల్లూరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) నూతన చైర్మన్ల ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం గోర్గల్ సొసైటీ ఫంక్షన్ హాల్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట పీఏసీఎస్ చైర్మన్‌గా పట్లోళ్ల జనార్దన్ రెడ్డి, మల్లూరు పీఏసీఎస్ చైర్మన్‌గా భుజంగారి వినోద వెంకట్రామిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు,  కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా హాజరై నూతన చైర్మన్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Swearing-in ceremony of Achampet and Mallur PACS chairmen held on a grand scale

ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత్ రావు మాట్లాడుతూ సహకార రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, రైతులకు అవసరమైన సేవలను సమర్థవంతంగా అందించడంలో పీఏసీఎస్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. రైతుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ, వ్యవసాయ రంగ అభివృద్ధికి కృషి చేయాలని నూతన చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన నాయకత్వంలో అచ్చంపేట, మల్లూరు సహకార సంఘాలు మరింత అభివృద్ధి సాధించి, రైతులకు మెరుగైన సేవలు అందిస్తాయని ఆశాభావం వ్యక్తమైంది. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల మార్కెట్ కమిటీ చైర్మన్లు, నిజాంసాగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన చైర్మన్లకు అభినందనలు తెలియజేశారు.

Swearing-in ceremony of Achampet and Mallur PACS chairmen held on a grand scale

More articles

Latest article