29 C
Hyderabad

మోదీ 25ఏళ్ల పాలనలో అభివృద్ధి దిశగా భారత్

India on the path to development under Modi's 25 years of rule

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కేంద్ర పథకాలతో కోట్ల మంది లబ్ధి

 

. . .  ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధన్ పాల్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని ప్రపంచంలో విశ్వ గురువుగా నిలువస్తుందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజా రాజకీయ జీవితం పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రద్ధానంద్ గంజిలో బుధవారం ” చాయ్ మిలన్ @ మోదీ జీ 25″ కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 13 ఏళ్లు ముఖ్యమంత్రిగా 12 ఏళ్ల దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ఎనలేని ప్రజాసేవ చేస్తున్నారని గుర్తు చేశారు. అనేక పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చి రైతులు, మహిళలు, పేద కుటుంబాలు, వృద్ధులు, విద్యార్థులు, చిరు వ్యాపారులకు అండగా నిలుస్తున్నారన్నారు. వైద్యం, ఇల్లు, బ్యాంకింగ్, ఆహార భద్రత వంటి రంగాల్లో పెనుమార్పులు తీసుకొచ్చారన్నారు. జన్ధన్ యోజన ఉజ్వల యోజన కిసాన్ సామాన్ నిధి ఆయుష్మాన్ భారత్ ఆవాస్ యోజన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన జల్జీవన్ మిషన్ తదితర పథకాలతో కోట్ల మంది లబ్దిపొందుతున్నారన్నారు. 2014 తర్వాత జాతీయ రహదారులు, రైల్వే, ఆసుపత్రులు, అంతరిక్షం, వైమానిక, సైనిక రంగాల్లో ఎన్నో రెట్ల వృద్ధి జరిగిందన్నారు. భారతదేశ జిడిపి 10వ స్థానం నుంచి ఏకంగా 4వ స్థానంకి ఎగబాకడం కేవలం మోదీ వల్లనే సాధ్యమైందని చెప్పారు. అనంతరం ఇందూరు ఛాయ్ వాలా మాదాసు స్వామి యాదవ్ మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన నాయకుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కొనియాడారు. నిరుపేద తల్లి కడుపున పుట్టి రైలులో చాయ్ విక్రయిస్తూ ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు.25 సంవత్సరాల ఈ ప్రజా రాజకీయ జీవితం రాబోయే తరాలకు మార్గదర్శనం వంటిదన్నారు. తన కుటుంబ ములాలు కూడా చాయ్ అమ్మిన కుటుంబానికి చెందినవి కావడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు శ్యామ్, కార్పొరేటర్లు బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి,  నిజామాబాద్ మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు కమల్ కిషోర్ , గుమస్తా సంఘం అధ్యక్షులు బాలు, దడువై సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, హమాలీ సంఘం అధ్యక్షులు అంజయ్య యాదవ్, పైట వెంకటేశం, ఆగమయ్య, తదితరులు పాల్గొన్నారు.

India on the path to development under Modi's 25 years of rule

More articles

Latest article