నిజామాబాద్ , బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి జిల్లా పరిషత్ సీఈవో సాయాగౌడ్ కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. డిఈవోగా పని చేస్తున్న అశోక్ కుమార్ సెలవులో వెళ్లిన విషయం తెల్సిందే. బుధవారం సాయాగౌడ్ డిఈవోగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు విద్యాశాఖాధికారులు ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. గతంలోనూ జడ్పీ సీఈవో ఇంచార్జి డిఈవోగా పని చేశారు.
