28.8 C
Hyderabad

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

Everyone must be vigilant against cybercrimes

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఉమెన్ కళాశాలలో సైబర్ క్రైమ్ అవగాహన

. . . పోలీస్ కమిషనర్ సాయిచైతన్య

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై ప్రజలు, ముఖ్యంగా విద్యార్థినులు అప్రమత్తంగా ఉండేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యతిధిగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్  సాయి చైతన్య పాల్గొని విద్యార్థినులకు సైబర్ నేరాలపై క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా రోజురోజుకూ కొత్త రూపాల్లో జరుగుతున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండటం ద్వారా అనేక మోసాలను నివారించవచ్చని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ప్రజల అత్యాశ, భయం, అత్యవసర పరిస్థితులు, ఉద్యోగాల అవసరం వంటి అంశాలను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్నారని వివరించారు. ప్రధానంగా ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్, సోషల్ మీడియా ఫేక్ ప్రొఫైల్ ఫ్రాడ్, డీప్‌ఫేక్ ఫ్రాడ్, పార్ట్‌టైమ్ జాబ్ ఫ్రాడ్, లోన్ ఫ్రాడ్, ఆన్‌లైన్ షాపింగ్ ఫ్రాడ్ తదితర సైబర్ మోసాల తీరును విద్యార్థినులకు వివరించారు. ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ విషయంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి నకిలీ యాప్‌లు, వాట్సాప్/టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పెట్టుబడులు పెట్టించి భారీ మొత్తంలో డబ్బులు దోచుకుంటున్నారని తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపించే పెట్టుబడి లింకులు, యాప్‌లను నమ్మవద్దని సూచించారు. డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ లో పోలీస్, సిబిఐ, కస్టమ్స్ తదితర ప్రభుత్వ సంస్థల అధికారులుగా నకిలీ వీడియో కాల్స్ చేసి కేసుల్లో ఇరుక్కున్నారని భయపెట్టి డబ్బులు బదిలీ చేయించుకుంటారని తెలిపారు. ఏ ప్రభుత్వ సంస్థ కూడా వీడియో కాల్ ద్వారా ‘డిజిటల్ అరెస్ట్’ చేసి డబ్బులు చెల్లించాలని ఆదేశించదని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థినులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు, సురక్షితమైన డిజిటల్ వినియోగం, వ్యక్తిగత సమాచార రక్షణ, ఆన్‌లైన్ లావాదేవీలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసిపి ప్రకాష్ యాదవ్ కాకతీయ, ఇన్స్టిట్యూట్స్ డైరెక్టర్ రజనీకాంత్, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సిఐ శ్రీముఖి, పాష, మాక్లూర్ ఎస్సై అనిల్ రెడ్డి, విద్యార్థినిలు పాల్గొన్నారు.

Everyone must be vigilant against cybercrimes
Everyone must be vigilant against cybercrimes

More articles

Latest article