33.1 C
Hyderabad

ఆటపాటలతో అలరించిన పోలీస్ ఫ్యామిలీ మీట్

Police family meet delights with games and entertainment.

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  పోలీసులకు కుటుంబాల సహకారమే కొండంత అండ కామారెడ్డి ఎస్పీ

 

కామారెడ్డి,  బతుకమ్మ :

 

పోలీసు ఉద్యోగం కేవలం ఉపాధి కోసం చేసేది కాదని, అది సమాజ రక్షణకు, ప్రజల భద్రతకు సంబంధించిన గురుతర బాధ్యత అని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. నిరంతరం ఒత్తిడితో కూడిన విధి నిర్వహణలో ఉండే పోలీసులకు వారి భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు అందించే ప్రోత్సాహం, సహకారమే కొండంత ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని తెలిపారు. మంగళవారం  రాత్రి కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల మధ్య ఆత్మీయతను, అనుబంధాన్ని బలోపేతం చేసే ఉద్దేశంతో ‘పోలీసు కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం’ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పనిచేస్తున్న హోంగార్డు స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు సిబ్బంది అందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకకు భారీగా హాజరయ్యారు.ఆప్యాయంగా పలకరించి.. యోగక్షేమాలు తెలుసుకొని ఈ సమ్మేళనంలో ఎస్పీ రాజేష్ చంద్ర స్వయంగా పాల్గొని ప్రతీ పోలీసు కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరించారు. వారి కుటుంబ వివరాలు, పిల్లల చదువులు, ఆరోగ్యం, ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ ఒకే కుటుంబంగా కలిసి సమయం గడపడం ప్రతి ఒక్కరిలో ఉత్సాహాన్ని నింపింది.

. . .  ఆటపాటలతో మారిన ప్రాంగణం.. డీజే పాటలకు ఎస్పీ నృత్యం!

పోలీస్ సిబ్బంది కుటుంబాల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని నింపేందుకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. మహిళా పోలీసులు, పోలీసుల కుటుంబ సభ్యులు బతుకమ్మ పాటలకు ఉత్సాహంగా కోలాటం, నృత్యాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన డీజే పాటలకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర కూడా స్వయంగా సిబ్బంది, వారి పిల్లలతో కలిసి డాన్స్ చేశారు. ఎస్పీ ఎంతో సాదాసీదాగా అందరితో కలసిపోవడంతో ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది.

Police family meet delights with games and entertainment.
 

. . .  పండుగల వేళా విధుల్లోనే ఉంటాం

ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. “సమాజంలో ప్రజలందరూ పండుగలు, శుభకార్యాలు, వేడుకలను తమ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో కూడా పోలీసులు 24 గంటలూ విధుల్లోనే ఉంటారు. ప్రజల రక్షణ కోసం నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తరచూ స్వసొంత కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటి కష్టసమయంలో భార్య, పిల్లలు ఇచ్చే అండదండల వల్లే పోలీసులు తమ విధులను నిర్భయంగా, సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నారు” అని కొనియాడారు.

. . . పోలీసు కుటుంబాల సంక్షేమానికి ప్రాధాన్యం:

పోలీసు కుటుంబాల సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ ఎల్లవేళలా అగ్రతాంబూలం ఇస్తుందని ఎస్పీ హామీ ఇచ్చారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది పిల్లల ఉన్నత విద్య, కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అవసరమైన అన్ని చర్యలు తక్షణమే తీసుకుంటామని తెలిపారు. ఇటువంటి ఆత్మీయ కలయికలు పోలీసు సిబ్బంది మధ్య, వారి కుటుంబాల మధ్య మానవీయ సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన స్పష్టం చేశారు.

Police family meet delights with games and entertainment.
 

 

More articles

Latest article