వెబ్ డెస్క్, బతుకమ్మ:
ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన మెడికల్ లీవ్, రావాల్సిన అలవెన్సులు బిల్లు చేయడానికి లంచం తీసుకుని ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ ఏసీబీకి చిక్కారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సబ్ డివిజన్ ట్రెజరీ కార్యాలయం సీనియర్ అకౌంటెంట్ కందాడ వేంకటయ్య ఒక ఉద్యోగి కి సంబంధించిన ఖజానా ద్వారా బిల్లు క్లియరెన్స్ కోసం రూ.25 వేలు లంచం డిమాండ్ చేశారు. సదరు ఉద్యోగి ఆగస్టు 14న రూ. 3 వేల ను నగదు రూపంలో, 18 న 22 వేలు యూపీఏ నుంచి నగదును తన ఖాతా లోకి బదిలీ చేయించుకున్నాడు. కాని పని చేయకుండా వేధించడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఆధారాలతో మంగళవారం ఎస్ టి ఓ సీనియర్ అకౌంటెంట్ వేంకటయ్య ను అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హజరు పరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు ఎసిబి అధికారులు తెలిపారు.
