31.9 C
Hyderabad

చాయ్ వాలా సుధాకర్ మృతి

Tea seller Sudhakar passes away

Must read

📰 Generate e-Paper Clip

 

. . . నిన్న భీమ్ గల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో లో నిప్పు పెట్టుకున్న సుధాకర్

 

.  . .  చికిత్స పొందుతూ ఆసుపత్రి లో మృతి

 

భీమ్ గల్, బతుకమ్మ :

 

కేసులు పెట్టి పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆత్మహత్యాయత్నం చేసిన సుధాకర్ ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. భీంగల్ పట్టణం కు చెందిన పొలాస సుధాకర్ స్థానికంగా చాయ్ హోటల్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల కాలం లో సుధాకర్ పై పోలీస్ లు అర్ధరాత్రి వరకు హోటల్ తెరిచి ఉంచుతున్నారు అని ఈ పెట్టి కేసులు నమోదు చేశారు. సోమవారం పోలీస్ స్టేషన్ రావాలని సమాచారం ఇచ్చారు. సోమవారం భీమ్ గల్ పోలీస్ స్టేషన్ వెళ్లిన సుధాకర్ కు కేస్ విషయం కోర్ట్ కు వెళ్లాలని సూచించారు పోలీస్ లు. దానితో మనస్తపం చెందిన సుధాకర్ తనతో పాటు ప్లాస్టిక్ బాటిల్ లో తెచ్చుకున్న పెట్రోల్ పిఎస్ ఆవరణలో పెట్రోల్ పోసుకొని నిప్పoటించుకొని ఆత్మహత్య యత్నం చేసిన విషయం తెలిసింది. స్థానికులు మంటలను అర్పి ఆసుపత్రి కి తరలించారు. తీవ్ర గాయాలు అయినా సుధాకర్ ను ముందుగా జిజిహెచ్ నిజామాబాద్ కు అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలిoచారు. అక్కడ చికిత్స పొందుతూ సుధాకర్ మృతి చెందినట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు.ఈ ఘటనలో సుధాకర్ తన అత్మహత్య కు కారణం స్థానిక కిరాణా వ్యాపారి ఒత్తిడి తో పోలీస్ లు కేసులు పెట్టి వేడిస్తున్నారు అని తెలిపారు. కానీ ఆసుపత్రి లో సుధాకర్ మరో విధంగా స్టేట్మెంట్ ఇచ్చారు. దానితో ఈకేసులో పోలీస్ వేధింపులు కారణం కాదు అని సీపీ ప్రకటన జారీ చేసారు. బాల్కొండ ఏమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాత్రం పోలీస్ వేధింపులు కారణం గా సుధాకర్ ఆత్మహత్య యత్నం చేసాడు అని ఆరోపించారు. ఇందుకు ఎస్ఐ తిరుపతి పై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేసారు. మంగళవారం భీమ్ గల్ బంద్ కు పిలుపు నిచ్చారు.

Tea seller Sudhakar passes away

 

. . .  భీంగల్ బంద్ ప్రశాంతం . . . ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

భీమ్ గల్ లో బంద్ ప్రశాంతగా సాగుతోంది. హోటల్ చిరు వ్యాపారి సుధాకర్ ఆత్మహత్య ను నిరసిస్తూ భీంగల్ పట్టణం లో వ్యాపారస్థులందరు స్వచ్చందంగా తమ తమ దుకాణాలను మూసి ఉంచి బంద్ పాటిస్తున్నారు.సుధాకర్ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసుల వేధింపుల కారణంగా ఆత్మహత్య యత్నం చేసి చికిత్స పొందుతూ మృతి చెందిన చాయివాలా సుధాకర్ కు నివాళులార్పించాడానికి హైదరాబాద్ నుంచి బయలుదేరిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని హైదరాబాద్ తన నివాసంలో పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పోలీస్ లు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. సుధాకర్ మృత దేహం భీంగల్ కు తెస్తే జరిగే పరిణామాలపై పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉంది. భారీగా పోలీస్ లను మొహరించారు.

Tea seller Sudhakar passes away

More articles

Latest article