నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయ ఎంపికలలో కేవలం ఇద్దరూ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులను మాత్రమే ఎంపిక చేయడాన్నీ జిల్లా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం కార్యవర్గం తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో గతంలో అధికారులకు ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చిన విస్మరించడం అక్షేపనీయమన్నారు.ఎల్ఎఫ్ ఎల్ హెచ్ఎం లు విధి నిర్వహణలో ఎస్ఎ లతో సమాన కేడర్ గా కాకుండా అడ్మినిస్ట్రేటర్ లుగా తీసుకొని ఎంపిక చేయకపోవడం శోచనీయమన్నారు. ఎంపిక తీరును తీవ్రంగా నిరసిస్తున్నామన్నారు. ఈ విషయాలు మళ్లీ పునరావృతం కాకుండా జిల్లా పాలనాధికారిణిని కలుస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపికలలో ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం లను అడ్మినిస్ట్రేటివ్ బేస్ గా తీసుకోవాలని, ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్స్ కు, ఆయలకు వెంటనే విత్తనాలు విడుదల చేయాలని, ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న జీవో నెంబర్ 25 ను సవరిస్తూ తరగతికి ఒక ఉపాధ్యాయున్ని నియమించాలని డిమాండ్ చేశారు. పై అంశాలను ఎన్నిసార్లు పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించడానికి రాష్ట్ర కార్యవర్గానికి వివరించడం జరుగుతుందన్నారు. త్వరలోనే ఈ అంశాలపై కార్యచరణ రూపొందించి ఆ దిశగా ముందుకు వెళ్తామన్నారు.ఈ సమావేశంలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు కే మల్లారెడ్డి, గౌరవ అధ్యక్షులు కొట్టూరు దేవదాస్ ప్రధాన కార్యదర్శి నాగేశ్వరరావు, కోశాధికారి జి సురేష్ రెడ్డి, చంద్రు నాయక్, రత్నకుమారి, కే నరేందర్, పి స్వప్న, తదితరులు పాల్గొన్నారు.
