. . . హెచ్ఎంఎస్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆందోళన
. . . యాజమాన్యంతో కలిసి చర్చలు
హైదరాబాద్, బతుకమ్మ :
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత లక్డీకాపూల్ లోని సింగరేణి భవన్ ఎదుట వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, హెచ్ ఎం ఎస్ నాయకులతో కలిసి బైఠాయించి, ధర్నా చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వకుండా సింగరేణి యాజమాన్యం తప్పించుకుంటోందని, డిపెండెంట్ ఉద్యోగాలు కార్మికుల హక్కు. అది మీరు వేసే బిచ్చం కాదని అన్నారు. కచ్చితంగా నెలకు రెండు రోజులు మెడికల్ బోర్డు పెట్టాల్సిందేనని, సింగరేణి లాభాల్లో 35 శాతం బోనస్ ను కార్మికులకు ఇవ్వాల్సిందేనని అన్నారు. అలియాస్ పేర్లు ఉన్న కార్మికులను విజిలెన్స్ పేరుతో వేధించవద్దని, కార్మికులను వేధిస్తూ అక్రమంగా ఉద్యోగాలు తొలగించిన వాళ్లకు మళ్లీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి సంబంధించి సీఎండీ వచ్చి మాతో చర్చలు జరపాలన్నారు. అనంతరం కవితతో సింగరేణి యాజమాన్యం చర్చలు జరిపింది. కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తామని యజమాన్యం హామీ ఇచ్చింది. 60 రోజుల్లోగా సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని కల్వకుంట్ల కవిత అన్నారు.

