33.2 C
Hyderabad

ప్రారంభమైన రెడ్ క్రాస్ ఎన్నికలు

Red Cross elections begin

Must read

📰 Generate e-Paper Clip

 

 

నిజామాబాద్, బతుకమ్మ  :

 

జిల్లా కేంద్రం లో రెడ్ క్రాస్ ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి.ఆదివారం జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రెడ్ క్రాస్ ఎన్నికలు బ్యాలెట్ పద్ధతి లో నిర్వహిస్తున్నారు. రెడ్ క్రాస్ మేనేజీంగ్ కమిటీని ఎన్నుకోవడంపై రెడ్ క్రాస్ సభ్యులు ఎంతో ఉత్సాహంగా ఆసక్తితో వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రెడ్ క్రాస్ సొసైటీ లో 9823 మంది సభ్యులు ఉన్నారు.

Red Cross elections begin

ఉదయం 8 గంటలకు ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు కొనసాగనున్నాయి, పోలింగ్ అధికారులు ఓటర్లకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పోలింగ్ బూతులను ఓటర్ల సంఖ్య కనుగుణంగా ప్రత్యేక గదులను ఏర్పాటు చేశారు.29 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గతం లో పదవులా పంపకం తో ఎకగ్రీవాలు జరిగాయి.

Red Cross elections begin

 

తొలిసారి ముప్పై సంవత్సరాల తరువాత ఎన్నికలు జరుగుతున్నాయి. జిల్లా సహకార అధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్నకలకు పోలీస్ బందోబస్త్ మధ్య ఏర్పాటు చేసారు. ఓటింగ్ నడుస్తున్న అభ్యర్థుల ప్రచారం మాత్రం ఆగలేదు.

 Red Cross elections begin

More articles

Latest article