27.2 C
Hyderabad

7న ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ

Protest rally under the aegis of the INDIA bloc on the 7th

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనీ అఖిల పక్షం డిమాండ్

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఇండియా కూటమిలో ఉన్న మిత్ర పక్షలతో కలిసి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ కార్యక్రమం పూర్తిగా బీజేపీ పార్టీకి అనుకూలంగా ఉందని,  కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలనీ అఖిల పక్షం తరుపున డిమాండ్ చేశారు.  ఆయనను తొలగించేతవరకు వారం రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ, మిత్ర పక్షాలతో కలిసి వివిధ రూపాలలో నిరసనలు చేస్తామని తెలిపారు.దేశ ప్రధాని మోదీ, అమిత్ షాకి కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తొత్తుగా వ్యవహారిస్తునరాని, రాష్ట్రంలో ఈ సర్ ప్రోగ్రాంలో కొన్ని లక్షల మంది ఓట్లు తొలగించారని,వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరి ఓటు కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మిత్ర పక్షాలు తీసుకుంటాయని ఈ సందర్బంగా తెలిపారు. స్వాతంత్రం వచ్చి 79సంవత్సరాలలో దేశంలో అనేక పార్టీలు దేశాన్ని పాలించాయని ప్రతి 10సంవత్సరాలకు ఒకసారి ఓటర్ల సవరణను చేస్తారని దాంట్లో భాగంగా బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘం రెండు కలిసి బీజేపీ కి అనుకూలంగా ఉన్న ఓట్లను ఉంచి మిగతా ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో మమత బెనర్జీ ఈ సర్ వల్లనే ఓడిపోయారని ఈ విధంగా అన్ని రాష్టాలలో అమలు చేసే ప్రయత్నం బీజేపీ,  కేంద్ర ఎన్నికల సంఘం చేస్తున్నాయని మండిపడ్డారు.జాతీయ ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో సోమవారం,మంగళవారం నాడు మండల కేంద్రాలలో ధర్నా కారక్రమాలు నిర్వహించడం జరుగుతుంది,బుధవారం రోజు జిల్లా కేంద్రంలో బారీ నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ,  వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్,  రాష్ట్ర కల్లు గీత కార్పొరేషన్ చైర్మన్ శేఖర్ గౌడ్,  సీపీఐ ఏం ఎల్ వనమాల కృష్ణ, ఆర్ఎస్పీ జిల్లా కార్యదర్శి కటారి రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి పెద్ది వెంకట్ రాములు, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ ఏం ఎల్ నగర కార్యదర్శి సుధాకర్,  సయ్యద్ ఫెరోజ్ అలీ,  రఘురామ్,  పిట్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Protest rally under the aegis of the INDIA bloc on the 7th
 

More articles

Latest article