34.1 C
Hyderabad

పిఎసిఎస్ భవన నిర్మాణానికి  రాజకీయ గ్రహణం

Political hurdles stall PACS building construction

Must read

📰 Generate e-Paper Clip

 

. . . భవన నిర్మాణానికి స్థానిక లీడర్ల అడ్డు

. . . ఆర్గోండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కంది శివరాములు

కామారెడ్డి , బతుకమ్మ:

కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం లో ఆర్గోండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవన నిర్మాణానికి రాజకీయ గ్రహణం పట్టింది. పిఎసిఎస్ భవన నిర్మాణ  పనులకు స్థానిక నాయకులు అడ్డుపడుతున్నారని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ కంది శివరాములు ఆరోపించారు. బుధవారం ఆయన పాలకవర్గ  డైరెక్టర్ లు, రైతులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సహకార సంఘం భవన నిర్మాణానికి పాలకవర్గ సభ్యులు , రైతుల ఆమోదంతో 50 లక్షల రూపాయలతో టెండర్లు పిలిచామని తెలిపారు. అయితే టెండర్ లో నలుగురు పాల్గొనగా కామారెడ్డికి చెందిన పురుషోత్తం అనే వ్యక్తి టెండర్ దక్కించుకున్నారని తెలిపారు. టెండర్ అయిన తర్వాత తాము పనులు చేపడతామని స్థానిక ఎమ్మెల్యే పిఏలు అనుచరుల బెదిరింపుల తో పనులు నిలిచిపోయాయని ఈ విషయం పలుమార్లు ఎమ్మెల్యేను పలుమార్లు డైరెక్టర్లతో కలిసి విన్నవించిన ప్రయోజనం లేదని ఆయన వాపోయారు. స్థానిక పార్టి నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి యువ నాయకుడు సల్మాన్ టెండర్ వేసిన తర్వాత తామే భవన నిర్మాణం చేపడతామని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని శివరాములు ఆరోపించారు.

More articles

Latest article