26.2 C
Hyderabad

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొరకు ఎమ్మెల్యే స్థల పరిశీలన

MLA site inspection for Young India Integrated School

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :  

 

అర్బన్ నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల మంజూరు చేయాలని ప్రభుత్వానికి అనేకసార్లు కోరడం జరిగిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. మంగళవారం గుండారం శివారులో స్థలాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పాఠశాలకు అవసరమైన 25 ఎకరాల స్థలం అర్బన్ లో కష్టతరమవుతుందన్నారు. ఈ నేపథ్యంలో నగరానికి దగ్గరగా ఉన్న గుండారంలో పరిశీలించడం జరిగిందన్నారు. అలాగే నగరంలోనూ మరో స్థలాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. నియోజకవర్గం విద్యార్థులకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అందుబాటులోకి తీసుకురావడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పటికే మొదటి దశలో జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు మంజూరయ్యాయన్నారు. రెండో దశలో అర్బన్ లోనూ మంజూరయ్యేలా కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే వెంట రూరల్ తహసీల్దార్ వినయ్ సాగర్, టీఎస్ఈడబ్ల్యూఐసీ ఈఈ  రవీందర్, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, జ్యోతి మురళి, ప్రసూన శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MLA site inspection for Young India Integrated School
 

More articles

Latest article