. . . పీసీసీ చీఫ్ పదవికి మహేష్ కుమార్ గౌడ్ రాజీనామా చేయాలి
. . . వీడీసీ ఆగడాల పై ఆర్మూర్ లో వినూత్న నిరసన
ఆర్మూర్, బతుకమ్మ:
ఏర్గట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో ఈ నెల 22న 39 గీత కార్మిక గౌడ కుటుంబాలను,10 ఎస్సీ కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేయడం పై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నిరసన తెలిపారు. విడిసీల అగడాలను నియంత్రించడంలో ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సీఎం ప్లేక్సి కి పిండ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ఆర్మూర్ ఇంచార్జ్ మైలారం బాలు మాదిగ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి చిత్రపటానికి రేవంత్ గౌడ్ అని ఎందుకు పెట్టాం అంటే మొన్న హైదరాబాద్ లో సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఆవిష్కరణ లో ఎంఎల్సీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ మా సీఎం రేవంత్ గౌడ్ అని మాట్లాడినారు.సీఎం ను గౌడ్లతో పిలిచిన మీరు మీ సొంత జిల్లా లో గౌడ కులస్తులను, ఎస్సీలను సాంఘిక బహిష్కరణ చేస్తే మీరు మీ ప్రభుత్వం ఉండి కూడా దండగ అని తక్షణం సాంఘిక బహిష్కరణకు బాధ్యత వహించాలని మీరు రాజీనామా చేయాలని ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేశారు. గౌడ కులస్తులను సాంఘిక బహిష్కరణ చేస్తే మీ ప్రభుత్వ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది అని గౌడ కులస్తులు ప్రభుత్వం మీద పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గౌడ కులస్తులకు ఎంఆర్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ అండగా ఉంటారని తెలియజేస్తున్నాం అన్నారు. గ్రామాభివృద్ధి కమిటీ లు రజాకార్లను తలపిస్తున్నాయి అని తక్షణం గ్రామాభివృద్ధి కమిటీ లను అణిచివేయాలని లేని యెడల ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ దృష్టికి తీసుకెళ్తాం ప్రత్యక్ష కార్యాచరణ ద్వారా ఉద్యమాన్ని కొనసాగిస్తాం అన్నారు. గౌడ కులస్తులు వినతి పత్రాలు కాకుండా సర్వాయి పాపన్న గౌడ్ వారసులు గా ఉద్యమాలను కొనసాగించాలని కోరారు. 24 గంటల్లో బహిష్కరణ ఎత్తి వేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు .ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ తరుణ్, కిరణ్, మార్క్ అశోక్, విప్లవ్, సాయన్న, బోట్లగంగరం, వరుణ్ తదితరులు పాల్గొన్నారు
