31.2 C
Hyderabad

జిల్లాలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం

Ganesh immersion passes off peacefully in the district.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సహకరించిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు

. . . నిజామాబాద్ పోలీస్ కమిషనర్

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

నిజామాబాద్ పోలీస్ కమిషనరేటు పరిధిలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గణేష్ విగ్రహ ప్రతీష్టాపన నుండి నిమజ్జనం వరకు పండుగ ఉత్సవాలు శాంతియుత వాతావరణంలో ప్రజలందరూ జరుపుకోవడం సంతోషకరమని, సహకరించిన ప్రతి ఒక్కరికి పోలీసు కమిషనర్ సాయిచైతన్య కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ కమిషనరేటు పరిధిలో  5811 గణేష్ విగ్రహాలు ప్రతిష్టించడం జరిగిందని, ప్రతిష్టాపన అనంతరం భక్తులందరూ సాంప్రదాయం ప్రకారం 9, 11 రోజుల పాటు మండపాలలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి తదుపరి నిమజ్జనం చేయడం జరిగిందన్నారు. దీనికి అన్ని మతాల ప్రజలు స్వచ్చందంగా సహకరించుకొని జయప్రదం చేయడం, నిమజ్జనం కోసం ప్రత్యేకంగా బాసర బ్రిడ్జి వద్ద కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బాసర , ఉమ్మెడ ఇవి కాకుండా మిగితా చాలా ప్రదేశాలలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పటిష్టంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ  వేడుకలు ప్రశాంత వాతావరణంలో గణేష్ విగ్రహాల ప్రతీష్టాపన, నిమజ్జనం వేడుకలు అన్నింటికి సార్వజనిక్ గణేష్ మండలి , విగ్రహ గణేష్ కమిటీలు , మజీద్ కమిటీలు,  అన్నిమతాల ప్రజలు , ప్రతీ ఒక్కరు పోలీస్ శాఖకు సహకరించారన్నారు. అదే విధంగా వివిధ శాఖల అధికారులు / సిబ్బంది ప్రత్యేకంగా రెవెన్యూ శాఖ, గ్రామ పంచాయతి మున్సిపాలటి , అబ్కారీ శాఖ, ఫైర్ సర్వీస్, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, గజ ఈతగాళ్లు అందరూ వారి సేవలను అందించారన్నారు. ఈ శుభ సందర్బంలో ప్రతీ ఒక్కరికి సీపీ సాయిచైతన్య కృతజ్ఞతలు, అభినందనలు తెలిపారు.

More articles

Latest article