27.2 C
Hyderabad

గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ స్పాట్ అడ్మిషన్స్

Degree Spot Admissions at Giriraj College

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల  2026-27 విద్యాసంవత్సరం స్పాట్ అడ్మిషన్స్ కోసం ఆసక్తి గల విద్యార్థులు  సెప్టెంబర్ 24,25వ తేదీలలో లోకల్ విద్యార్థులు ఒరిజినల్ ఎస్సెస్సీ, ఇంటర్ మార్క్ మెమోలు, టిసి, కులం, ఆదాయం, ప్రత్యేక కేటగిరీ సంబంధిత సర్టిఫికెట్లను జతచేసి కళాశాలోనే  దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. 26వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని, నాన్ లోకల్ విద్యార్థులు 28,29 తేదీలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వారికి 30వ తేదీన సీట్ల కేటాయింపు జరుగుతుందని, స్పాట్ అడ్మిషన్ పొందినవారు  పూర్తి ఫీజు చెల్లించవలసి ఉంటుందన్నారు. స్కాలర్ షిప్ అర్హత ఉండదని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. బి.కాం సీ.ఏ 1, టాక్సేషన్ 1,  మల్టీబుల్ డిసబిలిటీ చొప్పున బి.కాం లో 2 ఖాళీలు ఉన్నాయి. బిసిఏ లో ఆటిజం ఫిమేల్ 1, బిఏ ఇంగ్లీష్ మీడియం లోకో డిసబిలిటీ ఫిమేల్ 1,  మల్టీబుల్ డిసబిలిటీ 1 , బిఏ స్పెషల్  ఆటిజం ఫిమేల్ 1 ,బిఏ తెలుగు మీడియం బి.సి.బి. ఫిమేల్ 1  చొప్పున బిఏలో  మొత్తం 4 ఖాళీలు ఉన్నాయన్నారు. బిఎస్సీ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ లో  బ్లైండ్నెస్ ఫిమేల్ 1, బిఎస్సీ హెల్త్ కేర్ లో మల్టీబుల్ డిసబిలిటీ జనరల్ 1, ఫిమేల్ 1, ఆటిజం 1, చొప్పున 3 ఖాళీలు ఉన్నాయి. బిఎస్సీ లైఫ్ సైన్సు లో డెఫ్ హియరింగ్ జనరల్ 1, ఫిమేల్ 1, లోకో జనరల్ 2, ఫిమేల్ 1,  ఆటిజం జనరల్ 1, ఆటిజం ఫిమేల్ 1, మల్టీబుల్ డిసిబిలిటీ జనరల్ 2, ఫిమేల్ 1 చొప్పున మొత్తం లైఫ్ సైన్సులో 10 ఖాళీలు ఉన్నాయన్నారు. బిఎస్సీ ఆనర్స్ ఎస్సీ జనరల్ 4,  ఎస్టీ జనరల్ 3, ఫిమేల్ 1, ఎన్సిసి జనరల్ 1,  క్యాప్ ఫిమేల్ 1, లోకో ఫిమేల్1, మల్టీబుల్ డిసబిలిటీ ఫిమేల్ 1,ఈసీ ఫిమేల్ 1, డెఫ్ హియరింగ్ జనరల్ 1  చొప్పున 14 ఖాళీలు ఉన్నాయని ప్రిన్సిపాల్ తెలిపారు. రిజర్వేషన్ ఆధారంగా ఖాళీలు నింపబడుతాయని, అభ్యర్థులు లేని పక్షంలో నిబంధనల ప్రకారం సీట్లు కేటాయించబడతాయన్నారు. పూర్తి వివరాలకు కళాశాలను సంప్రదించాలని తెలిపారు.

More articles

Latest article