33.2 C
Hyderabad

ఎస్సారెస్పీ గేట్లు మూసివేత

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,మెండోరా: ఎగువ ప్రాంతాల నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లోకి వరద ప్రవాహం తగ్గడంతో గురువారం మధ్యాహ్నం ప్రాజెక్టు గేట్లను మూసి వేయడం జరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 14,454 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాకతీయ కాలువ ద్వారా 5800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 2200 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువ ద్వారా 150 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 500 క్యూసెక్కులు, వరద కాలువ ద్వారా 5000 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 80.501 టీఎంసీల నీరు నిలువ ఉంది.

More articles

Latest article