32.7 C
Hyderabad

తాడికల్ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం

Road accident on Tadikal National Highway

Must read

📰 Generate e-Paper Clip

 

. . .  డిచ్ పల్లి లో పని చేసే ముగ్గురు ట్రాన్సకో ఉద్యోగుల దుర్మరణం

హుజురాబాద్, బతుకమ్మ :

 

కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ వద్ద జాతీయ రహదారి 563 పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  రోడ్డు పై మారమ్మత్తుల కోసం ఆగిన లారిని వెనుక నుంచి వచ్చిన కార్ ఢీకొట్టింది. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది. నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం యానాం పల్లి లోని 400 కేవి సబ్ స్టేషన్ లో పని చేస్తున్న ట్రాన్స్ కో ఉద్యోగులు ముగ్గురు దర్మరణం చెందారు. అందులో లైన్ మెన్ ప్రభు ( నిజామాబాద్ వాసి), జూనియర్ లైన్ మెన్  విశ్వశ్వర్ రావు (వరంగల్), వాచ్ మెన్ సుధాకర్ ( డిచ్ పల్లి మండలం నడిపల్లి ) కి చెందిన ముగ్గురు స్పాట్ లోనే మృతి చెందారు. లైన్ మెన్ లు ప్రవీణ్, మురళి లు గాయపడగా కరీంనగర్ జనరల్ ఆసుపత్రి కి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు కార్ కు ముందు భాగం లో ఎయిర్ బ్యాగ్ లు తెర్చుకోవడంతో ముందు భాగం లో కూర్చున్న ఇద్దరు సేఫ్ గా బయట పడ్డారు. శంకర పట్నం పోలీస్ లు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదం లో ముగ్గురు ట్రాన్స్ కో ఉద్యోగులు దుర్మరణం, మరో నలుగురు గాయాలు పాలుకావడం తో  కరెంట్ డిపార్ట్ మెంట్ లో విషాదం నింపింది.

 Road accident on Tadikal National Highway

 

More articles

Latest article