. . . గుండెపోటుతో పండగనాడు మృతి
బిక్కనూర్, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ (బాలుర) ప్రధానోపాధ్యాయునిగా పని చేస్తున్న శ్రీనాథ్(58) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు మండల విద్యా అధికారి రాజాగంగారెడ్డి తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులో ఉన్న తన కుమారుని వద్దకు వెళ్లిన శ్రీనాథ్ గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీనాథ్ స్వస్థలం నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం. ఆయన మృతి పట్ల మండల ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు, సంతాపం వ్యక్తం చేశారు.
