నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
నగరంలోని 37వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి టెంట్ హౌస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డితో పాటు నగర మేయర్ ఉమారాణి, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా నగేష్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు మనవంతుగా కృషి చేయాలని, ప్రజలందరూ మట్టి వినాయకులను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని తెలిపారు.ఈ సందర్బంగా జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఎర్రం గంగాధర్, ప్రవీణ్, కో ఆప్షన్ సభ్యులు బొబ్బిలి మురళి,స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
