25.5 C
Hyderabad

రాష్ట్ర పంచాయితీ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎర్రం లింగం

Erram Lingam appointed as State Secretary of the State Panchayat Sarpanches Association.

Must read

📰 Generate e-Paper Clip

 

హైదరాబాద్, బతుకమ్మ:

నందిపేట్ గ్రామ పంచాయితీ సర్పంచ్ ఎర్రం లింగం తెలంగాణ రాష్ట్ర పంచాయితీ సర్పంచుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూమన్న యాదవ్ ఎర్రం లింగంకు నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గ్రామాల అభివృద్ధి, సర్పంచుల సంక్షేమం కోసం క్రమశిక్షణతో పనిచేయాలని,సంఘం నియమ నిబంధనలకు లోబడి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఫోరమ్ అధ్యక్షుడు సాయిరెడ్డి పాల్గొన్నారు. ఎర్రం లింగం రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన సందర్భంగా నందిపేట్ ప్రాంతంలో స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. సర్పంచుల సమస్యల పరిష్కారానికి, గ్రామ పంచాయితీల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఎర్రం లింగం తెలిపారు.

More articles

Latest article