25.5 C
Hyderabad

గూపన్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలి

Basic amenities must be provided at the Goopanpalli Government School.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . కలెక్టర్ కు పీడీఎస్ యు వినతి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని గూపన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ కి పీడీఎస్ యు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నగర అధ్యక్షులు ఎం.డి. నసీర్, నగర ప్రధాన కార్యదర్శి ఆర్. వినోద్ కుమార్ మాట్లాడుతూ, పాఠశాలలో సుమారు 130 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నప్పటికీ వారికి సరిపడా కనీస మౌలిక వసతులు లేవని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా యని, బాలికలు మరింత ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కేవలం రెండు మూత్రశాలలు మాత్రమే ఉండటం సిగ్గుచేటన్నారు.పాఠశాలలో తాగునీరు, విద్యుత్, ఫర్నిచర్, తరగతి గదులు, పరిశుభ్రత తదితర సౌకర్యాలను మెరుగుపరచ డంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనం, అందరికీ యూనిఫాం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే పాఠశాలకు అందుతున్న అమ్మఒడి, ఇతర ప్రభుత్వ నిధులను ఏ విధంగా వినియోగించారో అంశంపై సమగ్రంగా పరిశీలించి, అవసరమైన నిధులను పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారులు పాఠశాలను క్షేత్రస్థాయిలో సందర్శించి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి, కాలపరిమితిలో అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు కనీస సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తే విద్యార్థులు, తల్లిదండ్రులను కలుపుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీ ఎస్ యు నగర సహాయ కార్యదర్శి ఆల్గోట్ సృజన్, నగర కోశాధికారి మణితేజ, తాదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article