25.3 C
Hyderabad

కాంగ్రెస్ వైఫల్యాలపై బిఆర్ఎస్ పోరాటం

BRS's fight against Congress's failures

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ…

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలన, నెరవేర్చని హామీలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన వారం రోజుల నిరసన కార్యక్రమాల్లో భాగంగా నిజామాబాద్ నగరంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఆదివారం నగరంలోని ప్రధాన వీధుల మీదుగా ఆటో కార్మికులతో కలిసి ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలన పూర్తిగా కుప్పకూలిందని, ప్రజా సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన నిర్ణయాల వల్ల ఆటో కార్మికుల ఉపాధి దెబ్బతిని, వారి పొట్ట కొట్టే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన ఆదాయం లేక నిత్యం తిండికి కూడా ఇబ్బందులు పడుతూ, పలువురు ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో సోదరులకు అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు, నగరంలో పారిశుధ్య లోపాలపై బిఆర్ఎస్ నిరంతరం పోరాడుతోందన్నారు. హైమది బజార్ లో నిర్మించిన నూత మార్కెట్ దుర్గంధం తో అక్కడికి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే మహిళల సమస్యలపై ధర్నా,బైక్ ర్యాలీలు నిర్వహించామని, నేడు ఆటో కార్మికులకు మద్దతుగా నేడు  ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. నూతన ప్రభుత్వానికి ప్రజలు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ వేచి చూశారని, కానీ 1000 రోజుల సమయం ఇచ్చినా కాంగ్రెస్ పాలనలో ఎలాంటి పురోగతి లేదన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం చేసే నిజమైన తెలంగాణవాది కేసీఆర్ మాత్రమేనని, రాబోయే రోజుల్లో మళ్లీ బిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు కూడా స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఏడాదికి రూ. 12,000 ఇస్తామని హామీ ఇచ్చిందని, ఇప్పటివరకు ఆ డబ్బులు చెల్లించకపోవడంతో ఒక్కో ఆటో డ్రైవర్ కు రూ. 36,000 బాకీ పడిందని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే ఈ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగివచ్చి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి వారిని ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షులు సిర్ప రాజు, మాజీ నుడా చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, నాయకులు సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, చింతకాయల రాజు తదితరులు పాల్గొన్నారు.

BRS's fight against Congress's failures
BRS’s fight against Congress’s failures

More articles

Latest article