. . . డోజర్ , బొలెరో పట్టివేత
సాలురా, బతుకమ్మ :
సాలురా మండలం తగ్గేల్లి మంజీర నది నుంచి రాత్రివేళల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తహసీల్దార్ నవాజ్ ఆదేశాల మేరకు శనివారం రాత్రి ఆర్ఐ శంకర్ మంజీర నదిలో తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్న డోజర్, బోలెరోను అధికారులు పట్టుకున్నారు. అనంతరం తదుపరిచర్ల నిమిత్తం తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు.అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.

