28.2 C
Hyderabad

తీగలు దొంగిలించిన విద్యుత్ దొంగలు సస్పెండ్

Electricity thieves who stole wires suspended.

Must read

📰 Generate e-Paper Clip

 

ఆర్మూర్, బతుకమ్మ :

విద్యుత్ శాఖలో చర్చనియాంశమైన అల్యూమినియం తీగలు దొంగిలించిన లైన్ మెన్ రాజశేఖర్ రెడ్డి, ఏఎల్ఎం అరుణ్ లను సస్పెండ్ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసారు. ఆర్మూర్ డివిజన్ లోని  పెర్కిట్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు బాల్కొండ సెక్షన్ లో గల శ్రీరాంపూర్ గ్రామంలో బుధవారం చీకటి పడిన తర్వాత స్తంభానికి ఉన్న తీగల (వైర్లు)ను తొలగిస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. తప్పు ఒప్పుకున్న ఇద్దరు ఉద్యోగులు మరునాడు (గురువారం) తొలగించిన తీగలను కూలీల సహాయంతో సరిచేసారు. దీనిపై డివిజన్  అధికారులకు ఫిర్యాదు వెళ్ళడంతో విచారణ జరిపారు. ఉన్నత స్థాయి అధికారుల సూచన మేరకు దొంగతనానికి పాల్పడిన లైన్ మెన్, ఏఎల్ఎం లను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులను వారికి అందించినట్లు తెలిసింది.

More articles

Latest article