25.5 C
Hyderabad

ఒకరి మృతికి కారణమైన ముగ్గురికి పదేళ్ల కఠిన కారాగారం

Ten years of rigorous imprisonment for three people responsible for a death.

Must read

📰 Generate e-Paper Clip

 

. . . తీర్పు వెలువరించిన నిజామాబాద్ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి హరీష

నిజామాబాద్ లీగల్, బతుకమ్మ :

అనరాని మాటలు అన్నాడని అగ్రహించిన ఒక మహిళ తన కొడుకు,తమ్ముడితో కలిసి ఒక వ్యక్తిని కొట్టి అతని మృతికి కారణమైన ముగ్గురిని బింగేవార్ రాజమని, బింగేవార్ రాజు, అగపట్రే మాధవ్ లకు పది సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విదిస్తూ సోమవారం నిజామాబాద్ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి హరీష తీర్పు వెలువరించారు. వివరాల ఇలా ఉన్నాయి…మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లా బిలోలి తాలూకా సావ్లీ గ్రామానికి చెందిన రాజమని తన కొడుకు రాజు, బోసి గ్రామంలో నివసించే తన తమ్ముడు మాధవ్ లతో కలిసి బతుకు తెరువు కోసం నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి కి వలస వచ్చి నివాసముంటూ కూలీ పని చేస్తూ జీవించేది.కూలీ పని ప్రదేశంలో సహచర కూలీ, తన దగ్గర గ్రామ మచ్నూరే నివాసురాలు అరవై ఐదేళ్ల చాంద్కే తారాబాయితో సన్నిహితంగా ఉండేది.తారాబాయి కొడుకు చాంద్కే మాధవ్ 2022, ఏప్రిల్ 26న తన తల్లికి తనపైన చెడు అభిప్రాయం కలిగేల తప్పుడు మాటలు చెప్పడం కొంచెం దగ్గర నుండి విన్న రాజమని అతనిని బెదిరించింది. మరుసటి రోజు 27న పొద్దున ఏడు గంటలకు అర్సపల్లి కమాన్ దగ్గర టిఫిన్ చేయడానికి వెళ్లగా అక్కడ రాజమని ఆమె కొడుకు రాజు, ఆమె తమ్ముడు మాధవ్ లతో కలిసి తారాబాయి కొడుకు మాధవ్ ను చేతులతో కొడుతూ, కాళ్ళతో తన్నుతూ కింద పడేసి అతని పురుషాంగంపై తన్ని తీవ్రంగా గాయపరచడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. మాధవ్ మృతికి కారణమైనందున రాజమని, రాజు, మాధవ్ లకు పది సంవత్సరాల కఠిన జైలుశిక్షతో పాటు పది వేల రూపాయల జరిమానా విదిస్తూ కోర్టులో తీర్పు వెలువరించారు. జరిమానా చెల్లించని యెడల అదనంగా మూడు నెలల జైలుశిక్ష అనుభవించాలని జడ్జి తమ తీర్పులో పేర్కొన్నారు. పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ రెడ్డి ప్రాసిక్యూషన్ నిర్వహించారు.

More articles

Latest article