26.2 C
Hyderabad

అంతర్ రాష్ట్ర దొంగ అరెస్ట్

Inter-state thief arrested

Must read

📰 Generate e-Paper Clip

 

. . . 10 తులాల బంగారు నగలు స్వాధీనం

 

నందిపేట్, బతుకమ్మ :

 

నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల నిఘా, పక్కా సమాచారంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు అంతర్రాష్ట్ర నేరస్థుడిగా పేర్కొంటున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసి అతడి వద్ద నుంచి 10 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పర్భణి ప్రాంతానికి చెందిన షేక్ ఖయ్యుమ్ ఆలియాస్ రఫిక్ బేగ్ (23) ను నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడిగా గుర్తించారు. నిందితుడిపై గతంలో మహారాష్ట్రలోని కొత్వాలీ పోలీస్ స్టేషన్, కర్ణాటకలోని బీదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగతనం కేసుల్లోనూ నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిపై గతం లో కూడా పలు కేసులు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పోలీసులకు పక్కా సమాచారం మేరకు దొంగిలించినా బంగారు ఆభరణాలు విక్రయించేందుకు నిందితుడు నిజామాబాద్ వైపు గా ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించి అప్రమత్తమైన ఆర్మూర్ రూరల్ సిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ వినయ్ ఆధ్వర్యంలో నవీపేట్ రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తాను  దొంగతనానికి పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి 10 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసును చెందించిన పోలీస్ సిబ్బంది సిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ వినయ్, హెడ్ కానిస్టేబుల్ నరేందర్, కానిస్టేబుల్ అనిల్, శ్రీనివాస్, మహిపాల్ లను ఉన్నతాధికారులు అభినధించారు.

More articles

Latest article