26.9 C
Hyderabad

ఐడీపీఎల్ చౌరస్తాలో ఘనంగా తిరంగా ర్యాలీ

Must read

📰 Generate e-Paper Clip

 

. . . దేశ ఐక్యత, సమగ్రతను చాటేలా కార్యక్రమం

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఐడీపీఎల్ చౌరస్తాలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. విభిన్న జాతులు, సంస్కృతులు, భాషలు ఉన్నప్పటికీ భారతీయులంతా ఐకమత్యంతో జీవిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ భారతమాత ముద్దుబిడ్డలేనని, ‘జనగణమన’, ‘వందేమాతరం’ వంటి జాతీయ భావాలు దేశ ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ పటంపై తన ఔన్నత్యాన్ని మరింతగా చాటుకుంటోందని నాయకులు అన్నారు. దేశ అభివృద్ధి, ప్రగతి కోసం నరేంద్ర మోదీకి ప్రజలంతా అండగా నిలిచి ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ – మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు గిరివర్ధన్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొల్లి మాధవి, సీనియర్ నాయకులు, ఇంచార్జి డా. ఎస్. మల్లారెడ్డి, జిల్లా ఓబీసీ అధ్యక్షులు జేకే శేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు వడేపల్లి రాజేశ్వర్ రావు, జిల్లా జనరల్ సెక్రెటరీ విగ్నేష్, మాజీ కార్పొరేటర్ శేషగిరి రావు, కూకట్‌పల్లి అసెంబ్లీ ఇంచార్జి కాంత రావు, కన్వీనర్ శ్రీకర్ రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి నల్ల జయశేఖర్ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, సీనియర్ నాయకులు వేముల రమేష్, బీజేవైఎం నాయకులు శ్రీనాథ్, సాయి కిరణ్ రెడ్డి, ఆర్తిక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాలతో నిర్వహించిన తిరంగా ర్యాలీ దేశభక్తి, జాతీయ సమైక్యత సందేశాన్ని చాటుతూ ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.

 

A grand Tiranga rally at IDPL Square

More articles

Latest article