26.2 C
Hyderabad
Monday, August 3, 2026

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఐదు డీఏ లను విడుదల చేయాలని, నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్, ప్రైవేట్ ఆస్పత్రుల్లో అనుమతించాలని, పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని  వెంటనే అమలు చేయాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ కు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. పీసీసీ చీఫ్ ను కలిసిన వారిలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కే రామ్మోహన్ రావు, కోశాధికారి ఈవిల్ నారాయణ, జిల్లా నాయకులు మధుసూదన్, కృష్ణారావు తదితరులున్నారు.

 

More articles

Latest article