. . . ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశభక్తి కార్మిక సంక్షేమం సామాజిక బాధ్యతలను కేంద్ర బిందువుగా చేసుకొని భారతీయ మజ్దూర్ సంఘ్ ను ప్రారంభించారని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. భారతీయ మజ్దూర్ సాంగ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం నగరంలోని నిజామాబాద్ 2 డిపోలో జెండా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి రోజున దత్తో పంత్ తెంగడి బీఎంఎస్ ను స్థాపించారని గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్మికుల సంక్షేమం, సామాజిక భద్రత, ఉపాధి అవకాశాల విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. రాజకీయ ప్రయోజనాల కంటే కార్మికుల హక్కులు, దేశ ప్రయోజనాలు ముఖ్యమనే సిద్ధాంతంతో పనిచేస్తుందన్నారు. దేశంలో సభ్యత్వం పరంగా అతిపెద్ద కార్మిక సంఘాల్లో ఒకటిగా గుర్తింపు పొందడం సంతోషకరమన్నారు. ప్రధానంగా ” వికసిత్ భారత్” నిర్మాణంలో కార్మికుల పాత్ర కీలకమని శ్రమకు గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. దేశానికి రైతు అన్నం పెడితే కార్మికుడు దేశాన్ని నిర్మిస్తాడని కొనియాడారు. సంఘటిత, అసంఘటిత రంగాల్లో కార్మికులను సంఘటితం చేస్తుందన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు శ్రావణ్, మఠం పవన్, జ్యోతి మురళి, బీఎంఎస్ జిల్లా అధ్యక్షుడు సాయరెడ్డి, శ్రీనివాస్ చారి, రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వామి కుమార్, ఆర్టీసీ కార్మిక సంఘం ప్రతినిధులు కే.బీ.సింగ్, సరోజ, రాములు తదితరులు పాల్గొన్నారు.

