29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

త్రాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బాన్సువాడ మున్సిపల్ పరిధిలో ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు, సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాల్ రాజ్ సూచించారు.మంగళవారం పట్టణంలోని ఫిల్టర్ బెడ్‌ను సందర్శించిన ఆయన అక్కడి నుంచి జరుగుతున్న నీటి శుద్ధి, సరఫరా విధానాన్ని పరిశీలించారు. ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు నిరంతరంగా అందేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.నీటి శుద్ధి ప్రక్రియలో నాణ్యత ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని, పంపిణీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు త్రాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయనన్నారు. ఆయన వెంట మున్సిపల్ కౌన్సిలర్ ఖలేఖ్, బోడ భాస్కర్ రాజేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

 

 

Ensure that there is no disruption to drinking water supplies.

More articles

Latest article